బ్రేకింగ్... రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలు వాయిదా
X
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రముఖ యూనివర్శిటీల్లో రేపు, ఎల్లుండి జరగబోయే పరీక్షలు వాయిదా పడ్డాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్శిటీ, జెఎన్‌టీయూ పరిధిలోజరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సీటి పరిధిలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన ప్రవేశ పరీక్ష(PSTUCET 2023)లను వాయిదా వేస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ వెల్లడించారు. ఆరు కోర్సుల్లో ప్రవేశాలకు జరగాల్సిన పరీక్షలను తర్వాత నిర్వహించనున్నట్టు తెలిపారు. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే అభ్యర్థులకు తెలియజేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పాటు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడతో 26, 27న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.