తెలంగాణలో 39 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు
X
అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా తెలంగాణలో మొత్తం 39 రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడత పనులను ఈ నెల 6న ప్రధాన మోడీ వర్చువల్ గా ప్రారంబించనున్నారు. మొదటగా 21 స్టేషన్లకు సంబంధించిన పనులను మొదలుపెడతారు.
అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లను పూర్తిగా అధునీకరించనున్నారు. ప్లాట్ ఫామ్ లు, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడం, వెయింటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఉచిత వై-ఫై సదుపాలయాల్ని కల్పించనున్నారు. అలాగే స్థానిక ఉత్పత్తులతో వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థులు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ల ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్టేషన్లలో అవసరాలకు అనుగుణంగా బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేకమైన వసతులు కల్పించనున్నారు. వీటితో పాటు స్టేషన్ల ముందూ, వెనుక కూడా మొక్కలు, చెట్లతో గార్డెన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నవాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. పట్టాలకు ఇరు వైపులా కాంక్రీట్ దారులు, రూఫ్ ప్లాజాలు కట్టనున్నారు. ఇవి స్టేషన్లకు ఇరువైపులా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ్టుగా మార్చనున్నారు. దీనికి కేంద్రం 715 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి 221 కోట్లు కూడా కేటాయింది.