Home > తెలంగాణ > వాడని యూపీఏ ఐడీల రద్దు.. కేంద్రం ఆదేశాలు

వాడని యూపీఏ ఐడీల రద్దు.. కేంద్రం ఆదేశాలు

వాడని యూపీఏ ఐడీల రద్దు.. కేంద్రం ఆదేశాలు
X

డిజిటల్ చెల్లింపుల కోసం విరివిగా వాడుతున్న యూపీఐ ఐడీల(యూనిపైడ్ పేమెంట్స్ ఇటర్ఫేస్) విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికిపైగా ఎలాంటి లావాదేవీలూ జరపని యూపీఐ ఐడీలను, యూపీఐ నంబర్లను, ఫోన్ నంబర్లను ఈ ఏడాది డిసెంబర్ 32కల్లా డీయాక్టివేట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యూపీఐ యూజర్లు పలు ఫోన్లతో చాలా ఐడీలు నిర్వహిస్తుండం, యాక్టివేషన్‌లో లేని ఐడీల వల్ల సమస్యలు తలెత్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఫోన నంబర్లను మార్చే యూజర్లు యూపీఐ ఐడీలతో తమ బ్యాంకు ఖాతాలకు ఉన్న లింకులు తొలగించడం లేదు. వారి పాత ఫోన్ నంబర్లను టెలికం కంపెనీలు మరొకరి కేటాయిస్తుంటాయి. దీంతో కొన్ని సందర్భాల్లో ఆ నంబర్‌తో లింక్ అయి ఉన్నర యూపీఐ ఐడీలకు డబ్బు బదిలీలు జరుగుతున్నాయి. దీన్ని నివారించడానికి వాడకంలోని ఐడీలను రద్దు చేరయాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐI).. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది. వాడని ఫోన్‌ నంబర్లను యూపీఐ మ్యాపర్‌ నుంచి తొలగించాలని సూచించింది. సురక్షితమైన లావాదేవీల కోసం.. ఫోన్ నంబరుకు ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు మొబైల్ యాప్స్‌లోని పేరుకు బదులు కస్టమర్‌ను పేరును చూపించాలని కోరింది.


Updated : 17 Nov 2023 10:31 PM IST
Tags:    
Next Story
Share it
Top