హ్యాట్రిక్ సీఎం కేసీఆర్..? ఇండియా టుడే కవర్ స్టోరీ
X
కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతాడా? లేదా? దక్షిణ భారతాన చరిత్ర సృష్టిస్తాడా లేదా? అనేది ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ఇండియా టుడే తాజా సంచికలో కేసీఆర్‌పై కవర్ పేజీ స్టోరీని ప్రచురించింది. ‘కెన్ కేసీఆర్ డు ఏ హ్యాట్రిక్?’ టైటిల్ తో పబ్లిష్ చేసిన ఈ కథనంలో.. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కొత్త రాష్ట్రం అయినప్పటికీ అనతికాలంలోనే దేశంలో మరే రాష్ట్రం సాధించని రికార్డులు, ప్రగతిని కేసీఆర్ అందులో వివరించారు. 2018 ఎన్నికల్లో సాధించిన సీట్లకన్నా ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సీఎం కాబోతున్నట్లు కేసీఆర్ ధీమా వ్యాక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కుటుంబ పాలనపై వస్తున్న విమర్శలను కేసీఆర్ వివరించారు. ప్రధాని మోదీ తన పర్యటనలో ప్రస్తావించిన అంశాలపై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎలా మారింది అనే అంశాలను వివరించారు.