రిచర్డ్ అంపైర్గా ఉన్న మ్యాచుల్లో టీమిండియా ఓటమి.. ఈ సారి..
X
వరల్డ్ కప్ ఫైనల్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఈ మెగా మ్యాచ్ కోసం రెండు టీంలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచుల్లో గెలిచి టీమిండియా మంచి ఊపు మీద ఉంది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అభిమానులను ఓ విషయం కలవరపెడుతోంది. అదేంటంటే ఈ మ్యాచ్కు రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్గా వ్యవహరించడమే. రిచర్డ్ అంపైర్గా ఉన్న చాలా మ్యాచ్లలో ఇండియా ఓడిపోయింది. దీంతో రిచర్డ్ అంపైరింగ్ అశుభం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
గత ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్న వాటిల్లో టీమిండియా ఓడిపోయింది. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో రిచర్డ్ అంపైర్గా వ్యవహరించగా.. శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది. 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్స్, 2016 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియాకు ఓటమి ఎదురైంది. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్, 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్ల చేతుల్లో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్లన్నింటికీ రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్గా ఉన్నాడు. దీంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఏం జరుగుతుందో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.