Home > తెలంగాణ > రైల్వేలో 1,697 ఉద్యోగాలు .. ఐటీఐ చాలు..

రైల్వేలో 1,697 ఉద్యోగాలు .. ఐటీఐ చాలు..

రైల్వేలో 1,697 ఉద్యోగాలు .. ఐటీఐ చాలు..
X

ఏటా వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్న భారతీయ రైల్వే మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీలోని ప్రయాగ్‌‌రాజ్ కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ 1,697 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 14 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 100. ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్లలో ఫిట్టర్, కార్పెంటర్, మెకానిక్, ప్లంబర్, డ్రాప్ట్ మెన్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అభ్యర్థులు పదో తరగతి పాసై సంబబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. వయసు డిసెంబ్ 14, 2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు https://www.rrcpryj.org/index.php చూడొచ్చు.

Updated : 15 Nov 2023 4:22 PM IST
Tags:    
Next Story
Share it
Top