Home > తెలంగాణ > ఆర్టీఐ దరఖాస్తు.. అధికారుల రిప్లై మామూలుగా లేదుగా..

ఆర్టీఐ దరఖాస్తు.. అధికారుల రిప్లై మామూలుగా లేదుగా..

ఆర్టీఐ దరఖాస్తు.. అధికారుల రిప్లై మామూలుగా లేదుగా..
X

ఓ వ్యక్తి కోవిడ్ సమాచారం కోసం ఆర్టీఐ దరఖాస్తు చేశాడు. అయితే అతడికి అధికారులు ఇచ్చిన రిప్లై చూసి అంతా అవాక్కయ్యారు. ఎందుకంటే ఏకంగా 40వేల పేజీల్లో అధికారులు సమాధానం ఇవ్వడం గమనార్హం. వాటిని తీసుకెళ్లేందుకు దరఖాస్తుదారిడికి ఓ వాహనమే కావాల్సివచ్చింది. పైగా 80వేల రూపాయలు కట్టకుండానే అతడు వాటిని తీసుకెళ్లాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.

ఇండోర్కు చెందిన ధర్మేంధ్ర శుక్లా.. కరోనా సమయంలో ఔషధాలు, వైద్య పరికరాలకు సంబంధించిన టెండర్స్, బిల్లుల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు.శుక్లా దరఖాస్తు చేసి నెలదాటిన అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీంతో శుక్లాకు సంబంధిత సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో కిందిస్థాయి అధికారులు 40వేల పేజీల సమాధానమిచ్చారు.

ఈ పేజీలతో తన ఎస్యూవీ కారు మొత్తం నిండిపోయిందని.. అతికష్టం మీద వాటిని ఇంటికి చేర్చినట్లు శుక్లా తెలిపారు. అయితే పేజీకి 2 రూపాయల చొప్పున ప్రభుత్వానికి శుక్లా 80వేలు చెల్లించాలి. అయితే అధికారులు ఆలస్యం చేయడంతో ఆ డబ్బులు తీసుకోకుండా సమాచారం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు 80వేల నష్టం వచ్చింది. కాగా ఈ నష్టానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

Updated : 29 July 2023 4:41 PM IST
Tags:    
Next Story
Share it
Top