మెదక్ ఎంపీపై దాడి.. ప్రభుత్వ కీలక నిర్ణయం..
X
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రత పెంచింది. ప్రస్తుతం ఉన్న 2+2 సెక్యూరిటీని 4 + 4కు పెంచింది. ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ ఈ మేరకు అన్ని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
దుబ్బాక నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై సోమవారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో బీఆర్ఎస్పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీలో ఉన్న అభ్యర్థులకు వెంటనే భద్రతను పెంచాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. కేవలం అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులకు మాత్రమే భద్రత పెంచడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తమ అభ్యర్థులకు సెక్యూరిటీ పెంచాలన్న విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.