సింగరేణి ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడి
Krishna | 27 Dec 2023 9:18 PM IST
X
X
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తొలి ఫలితం వెల్లడైంది. ఇల్లందు ఏరియాలో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ విజయం సాధించింది. సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీపై 46 ఓట్ల తేడాతో ఐఎన్టీయూసీ గెలిపొందింది. మొత్తం 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అర్ధరాత్రి సమయంలో తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. చివరన శ్రీరాంపూర్ ఏరియా ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలవగా.. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా అంతకుముందు సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 5గంటల వరకు కొనసాగింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో 94 శాతం పోలింగ్ నమోదైంది.
Updated : 27 Dec 2023 9:18 PM IST
Tags: yellandu intuc win singareni elections singareni polling singareni counting singareni results singareni workers singareni employees singareni unions intuc aituc tbgks congress union cpi union telangana news telangana updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire