Home > తెలంగాణ > రేవంత్ ప్రమాణ స్వీకారం.. అమరుల కుటుంబాలకు ఆహ్వానం

రేవంత్ ప్రమాణ స్వీకారం.. అమరుల కుటుంబాలకు ఆహ్వానం

రేవంత్ ప్రమాణ స్వీకారం.. అమరుల కుటుంబాలకు ఆహ్వానం
X

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి 300 మంది అమరవీరుల కుటుంబాలను టీపీసీసీ ఆహ్వానించింది. 250 మంది తెలంగాణ ఉద్యమకారులను కూడా పిలిచింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే రేవంత్ రెడ్డి అమరవీరులను తలుచుకుని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ విజయం అమరులకు అంకితమని ప్రకటించారు.

రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం అందింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీలను రేవంత్ స్వయంగా ఇన్వైట్ చేశారు. వీరితో పాటు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అశోక్ గెహ్లోత్, భూపేష్ బఘేల్, అశోక్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, మీరాకుమార్, చిదంబరం, సుశీల్ కుమార్ తదితరులు ప్రమాణస్వీకారోత్సవానికి అటెండ్ కానున్నారు.

Updated : 6 Dec 2023 4:42 PM IST
Tags:    
Next Story
Share it
Top