KCR : అయోధ్యలో వేడుకకు హాజరుకావాలని కేసీఆర్‌కు ఇన్విటేషన్
X
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రావాల్సందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర తరుపున ఆహ్వానం పంపించారు. దేశ వ్యాప్తంగా అన్ని పొలిటికల్ పార్టీలకు సీఎంలకు,ప్రముఖులందరిని ట్రస్ట్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల నుంచి జన సేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హీరోలు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లకు ఆహ్వానం అందింది.ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా అయోధ్య రామునికి వివిధ రూపాలలో సేవలు అందుతున్నాయి. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బాలరాముడు శిల్పాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు.