Home > తెలంగాణ > Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్.. పోలీసుల అలర్ట్..

Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్.. పోలీసుల అలర్ట్..

Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్.. పోలీసుల అలర్ట్..
X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్నారు. (Chandrababu Arrest) ఆయనకు మద్ధతుగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయిస్ లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు నల్ల షర్టులు ధరించి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. దీంతో మెట్రో స్టేషన్ల వద్దకు ఐటీ ఎంప్లాయిస్ భారీగా చేరుకుంటున్నారు.

ఈ నిరసన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లచొక్కాలు ధరించిన వారిని లోపలకు అనుమతించడం లేదు. చంద్రబాబు అభిమానులు భారీగా తరలిరావడంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌ను అధికారులు కాసేపు తాత్కాలికంగా మూసేశారు. దీంతో టీడీపీ అభిమానులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Updated : 14 Oct 2023 6:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top