ఓటేస్తారా..? టూరుకెళ్లారా?.. ఎన్నికలపై ఆసక్తి చూపని ఐటీ ఉద్యోగులు
X
పోలింగ్ కు ఇంకా నాలుగు రోజులే మిగిలుంది. పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ, తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈసారి పోలింగ్ తేది నవంబర్ 30న వచ్చింది. దీంతో పోలింగ్ శాతం పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఐటీ ఉద్యోగుల్లో ఎంతమంది ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం 30 తారీకున సెలవు ప్రకటించింది. ఆ తర్వాత ఒక్క రోజే పనిదినం (శుక్రవారం) మినహాయిస్తే.. శని, ఆదివారాలు వరుస సెలువులు. దీంతో ఐటీ ఉద్యోగులు లాంగ్ వీకెండ్ లీడ్ తీసుకుని టూర్లకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగులకు కూడా శని, ఆదివారాలు సెలవులు. కాగా.. వీరు కూడా ఓటింగ్ కు దూరంగా ఉండే చాన్స్ ఉంది. ఎన్నిల ఏదైనా సిటీలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. ఐటీ కారిడార్ లో సుమారుగా 7 లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటారు. చాలామందికి సిటీలో ఓటు హక్కులేదు.
30 నుంచి 40 శాతం మంది సొంతూళ్లలోనే ఓటు హక్కు ఉంటుంది. 25శాతం మంది ఇతర రాష్ట్రం నుంచి వచ్చినవారు.. 75 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఉంటారు. అందులో హైదరాబాద్ లో స్థిరపడ్డవారు 40 శాతం మంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఆ 40 శాతంలో 10 శాతంమంది కూడా ఓటు వినియోగించుకోవడం లేదు. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ, ఎంపీ ఇలా ఏ ఎన్నిక చూసినా.. బస్తీలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ తక్కువగానే జరిగింది. పోలింగ్ డేను హాలిడేగా భావిస్తూ చాలామంది ఓటును వినియోగించట్లేదు. 2020 ఎలక్షన్స్ లో కూడా అదే జరిగింది. పోలింగ్ డేను హాలిడేగా భావించి చాలామంది టూర్లకు వెళ్లారు. సిటీలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చైతన్య కార్యక్రమాలు చేపట్టినా ఫలితం ఉండట్లేదని అధికారులు చెప్తున్నారు. 2018 ఎన్నికల్లో 50 శాతంలోపే పోలిగ్ కాగా.. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.71 శాతం మాత్రమే నమోదైంది. ప్రధానంగా బస్తీల జనాలే ఓటేసేందుకు ముందుకొస్తుండగా, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ వంటి కొన్ని ప్రాంతాల్లో నివసించే వారు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడంలేదు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.