రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా శనివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పాటు పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే వానలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వానలు పడక, ఎండల తీవ్రతతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డ రాష్ట్ర ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటుతెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి, మహబూబ్‌నగర్, హనుమకొండ, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి. ఇక సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.