Home > తెలంగాణ > KCR : పార్లమెంట్‌లో ఆగని సస్పెన్షన్లు.. BRS ఎంపీలకు కేసీఆర్ ఫోన్లు

KCR : పార్లమెంట్‌లో ఆగని సస్పెన్షన్లు.. BRS ఎంపీలకు కేసీఆర్ ఫోన్లు

KCR : పార్లమెంట్‌లో ఆగని సస్పెన్షన్లు.. BRS ఎంపీలకు కేసీఆర్ ఫోన్లు
X

ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంటులో మంగళవారం సైతం లోక్ సభ నుంచి 50 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎంపీల సస్పెన్షన్‌తో ఉభయ సభలు సజావుగా నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ సెషన్‌లో మొత్తం 142 మంది ఎంపీలపై చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలకు ఫోన్లు చేసి.. ఎంపీలంతా ఉన్నపళంగా వెనక్కి వచ్చేయాలని ఆదేశించారు. ఉభయ సభల ఎంపీలు వెంటనే హైదరాబాద్ రావాలని పిలిచినట్లు సమాచారం.

కాగా, లోక్‌సభలో మొత్తం 96 మంది ఎంపీలు, రాజ్యసభలో 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. తాజాగా.. ఇవాళ మరో 50 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే, ఇవాళ సభలు ప్రారంభం కాగానే సస్పెన్షన్‌లను నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో 50 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. దీంతో సభలో మళ్లీ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది.

సోమవారం 92 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో విపక్ష సభ్యులు నేడు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ ఎంత నచ్చజెప్పినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గేందుకు నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు మొత్తం 50 మంది విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.




Updated : 19 Dec 2023 8:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top