Home > తెలంగాణ > బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు
X

రాష్ట్రంలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే నివాసాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీళ్లిద్దరి కంపెనీల్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేంద్ర బలగాల పహారాలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీకి డైరెక్టర్‌గా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నట్లు ఐటీ గుర్తించింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. గతంలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేయగా తాజాగా ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు సంచలనంగా మారాయి.

కేంద్రంలోని బీజేపీ కి వ్యతిరేకంగా కేసీఆర్ సర్కార్ దూకుడుగా విమర్శలు చేస్తుంది. అయితే బీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులపై ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ ఆ పార్టీ నేతలకు సూచించారు. ఈ దాడులను చట్టపరంగా ఎదుర్కొందామని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. గతంలో మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవాళ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే , ఎంపీ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ, ఐటీ అధికారుల సోదాలకు సంబంధించి తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Updated : 14 Jun 2023 10:26 AM IST
Tags:    
Next Story
Share it
Top