Home > తెలంగాణ > హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్.. BRS MLA ఇంట్లో సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్.. BRS MLA ఇంట్లో సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్.. BRS MLA ఇంట్లో సోదాలు
X

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతోన్నాయి. బుధవారం ఉదయం నుంచి బీఆర్ఎస్ నేత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 70 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఈ సోదాలు మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అనేక కంపెనీల్లో బినామీగా ఉన్నాడని.. 15 కంపెనీల్లో పెట్టుబడిదారుగా ఉన్నారని అంటున్నారు.


ఏకకాలంలో ఎమ్మెల్యే నివాసాలు, కార్యాలయాలతో పాటు సిబ్బంది ఇంట్లో ఈ తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు వ్యాపారులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. హిల్ ల్యాండ్ టెక్నాలీజిస్ కంపెనీ , మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీలో సోదాలు జరుగుతున్నాయి. ఈ రెండు కంపెనీలకు డైరెక్టర్ గా వనితా కోమటి రెడ్డి ఉన్నారు. కొత్తపేట కార్యాలయంలో, భువనగిరిలోని ఎమ్మెల్యే నివాసంలో.. మొత్తం 12 చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated : 14 Jun 2023 7:57 AM IST
Tags:    
Next Story
Share it
Top