Home > తెలంగాణ > హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో సోదాలు
X

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాదులో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు పారిజాత ఇళ్లలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చిగిరింత పారిజాత నరసింహారెడ్డికి సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. పారిజాత బడంగ్‌పేట్ మేయర్ గా ఉన్నారు.





బాలాపూర్ లోని పారిజాత నివాసంలో ఉదయం 5 గంటల నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహా రెడ్డిలు హైదరాబాద్ లో లేరు. పారిజాతానర్సింహారెడ్డి తిరుపతిలో, ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇంట్లో ఉన్న పారిజాత కూతురి ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పారిజాతకు సంబంధించిన ఇల్లు, కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్ఆర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటి సోదాలు కలకలం రేపుతున్నాయి.





వీరిద్దరితో పాటు పలువురు రాజకీయనాయకుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇలా ఐటీ దాడులు నిర్వహించడం ఇదే తొలిసారి. వాహనాల్లో తరలిస్తున్న డబ్బును పట్టుకోవడం, సీజ్ చేయడం ఈ సమయంలో జరుగుతుంది. కానీ ఇలా ఎన్నికల సన్నాహాల్లో ఉన్న రాజకీయనాయకుల ఇళ్లలో తనిఖీలు ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




Updated : 2 Nov 2023 2:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top