IT RAIDS: హైదరాబాద్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 100 టీంలతో..
X
హైదరాబాద్‌లోని పలుచోట్ల ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో 100 టీంలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కంపెనీలతో పాటు వ్యాపారుల ఇళ్లలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లిలోని హిందూ ఫార్చ్యూన్‌లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సోదరుల నివాసంతో పాటు వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వరరావు, రఘువీర్‌ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. కేపీహెచ్బీ లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో ఆదాయ పన్ను అవకతవకలకు సంబంధించి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు తమిళనాడులోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నలభై చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎంకే ఎంపీ జగత్ రక్షకన్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.