Vivekanand : బిగ్ బ్రేకింగ్.. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో IT సోదాలు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈసారి మాజీ ఎంపీ, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసం లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఆయన అనుచరుల ఇండ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి మంచిర్యాలలోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి వివేక్‌కు చెందిన కంపెనీల డబ్బును చెన్నూర్ నియోజక వర్గంలో ఓటర్లను కొనేందుకు డబ్బు తరలిస్తున్నారని ఆరోపణలు రాగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల వివేక్ కు చెందిన రూ. 8 కోట్ల డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. గతంలో రూ.50 లక్షలతో వివేక్ కంపెనీ ఉద్యోగులు పట్టుబడిన విషయం తెలిసిందే. వివేక్, వినోద్ ఇళ్లతో పాటు ఆయన కూతురు ఇంట్లోను ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నూరులో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నాయకులు, అనుచరులు వివేక్ ఇంటికి చేరుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కావాలనే తమపై కుట్ర చేస్తున్నారు ఆరోపించారు. ఓటమి భయంతోనే ఐటీ, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.