Home > తెలంగాణ > మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ రైడ్స్

మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ రైడ్స్

మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ రైడ్స్
X

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఉదయం నుంచి నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్‌, సిబ్బంది, ఇంటి కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని సబితా సమీప బంధువు ప్రదీప్‌ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రముఖ ఫార్మా కంపెనీల్లోనూ, ఫార్మా కంపెనీ చైర్మన్‌, సీఈవో, డైరెక్టర్‌, సిబ్బంది ఇళ్లలోను సోదాలు జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా ఏకకాలంలో 15చోట్ల ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేతలకు ఫార్మా కంపెనీలు నిధులు ఇస్తారనే అంచనాతో ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

4 రోజుల క్రితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. వారం రోజుల క్రితం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు పారిజాత నరసింహారెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కేఎల్‌ఆర్‌, మాజీ మంత్రి జానా రెడ్డి నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు.

Updated : 13 Nov 2023 8:56 AM IST
Tags:    
Next Story
Share it
Top