Home > తెలంగాణ > Ponguleti Srinivas reddy: హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంలో ముగిసిన సోదాలు

Ponguleti Srinivas reddy: హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంలో ముగిసిన సోదాలు

Ponguleti Srinivas reddy: హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంలో ముగిసిన సోదాలు
X

పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో న్ను శాఖ సోదాలు ముగిశాయి. ఈ సందర్భంగా 3 బ్యాగులు, ఒక సూట్ కేస్, ప్రింటర్, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో వున్న రాఘవా ప్రైడ్ ఆఫీసుతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెం 17లో వున్న ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బెంగళూరు, చెన్నైకి చెందిన 200 మందికి పైగా అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

ఇంకా 10 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు వందల మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా 10 చోట్ల ఐటీ దాడులు సాగుతూనే ఉన్నాయి. సెంట్రల్, స్టేట్ ఎన్నికల కమిషన్ లకు ఫిర్యాదు చేశాను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలకు సపోర్టు ఉందా ఎన్నికల కమిషన్ అనిపిస్తోంది.. ఎన్నికల కమిషన్ బ్యాలెన్స్ తప్పుతున్నారా లేక అధికారం ఒత్తిడికి లోంగుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మీదనే దాడులు జరుగుతున్నాయని పొంగులేటి అన్నారు.

బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫెవికాల్ సంబందం ఉంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. "నా అల్లుడు మీద దురుసుగా ప్రవర్తించారు. నా ఉద్యోగి జయ ప్రకాష్ నీ కొట్టారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. వంటి కాలు మీద చైర్ లో నిలబెట్టారు. ఒప్పుకోవాలని బలవంతం చేశారు అని ఆయన వెల్లడించారు. ఐటీ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అధికారులు మీరు హద్దుల్లో ఉండాలి.. ఐటీ రూల్స్ అందరికీ తెలుసు, అధికారంలో ఉన్న పార్టీకి వత్తాసు పలికితే చాలు అన్నట్లుగా ఉన్నారు. దీని వెనుక కారణాలు ఏమిటి.. మ్యాన్ హ్యాండిలింగ్ చేసే హక్కు ఎవ్వరు ఇచ్చారు? బీఆర్ఎస్‌పై స్వరం పెంచిన తరువాత.. నాతో పాటు అనేక మంది వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టారు ఓర్చుకున్నాం. మా కంపెనీలపై దాడులు చేశారు... అనుమతి ఇచ్చిన ప్రాజెక్టును ఆపివేశారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు... రిటర్న్ గిఫ్ట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలు ఇస్తారు. అసలు గిఫ్ట్.. కేంద్రంలో ఇవ్వబోతున్నారు" అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.




Updated : 10 Nov 2023 9:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top