Home > తెలంగాణ > Telangana Cabinet: సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

Telangana Cabinet: సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

Telangana Cabinet: సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
X

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరుగునున్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల్లోని మరో రెండు స్కీమ్‌ల అమలు, బడ్జెట్ సమావేశాల అజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. ఆదివారం జరగనున్న భేటీలో మరో రెండు గ్యారెంటీలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీలను సైతం మంత్రి మండలి ఖరారు చేయనున్నట్లు టాక్. కేబినెట్ భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.

ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మాదిరిగానే మధ్యంతరం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే.


Updated : 2 Feb 2024 2:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top