Home > తెలంగాణ > తెలంగాణ బాలుడికి..ఇటలీ అమ్మానాన్నలు

తెలంగాణ బాలుడికి..ఇటలీ అమ్మానాన్నలు

తెలంగాణ బాలుడికి..ఇటలీ అమ్మానాన్నలు
X

ఇటలీ దేశానికి చెందిన దంపతులు తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 10ఏళ్ల బాలుడిని దత్తత తీసుకున్నారు. కొన్నేళ్లుగా పిల్లలు లేక అలమటించిన ఆ దంపతులు బాలుడి రాకతో పుత్రోత్సాహంలో మునిగిపోయారు. అనాథగా శిశు గృహంలో బతుకీడుస్తున్న బాలుడికి తల్లిదండ్రుల ప్రేమ లభించనుంది. భారత ప్రభుత్వ దత్తత నిబంధనల ప్రకారం అన్ని అంశాలను పరిశీలించిన అధికారులు బాలుడిని దత్తత ఇచ్చేందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.





ఇటలీ దేశానికి చెందిన దంపతులు స్టెఫానో పెట్టొరలి, మరీనాలకు పిల్లలు లేరు. ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకోవాలనుకున్నారు. ఇంటర్నెట్‎లో వివరాల కోసం సెర్చ్ చేశారు. ఖమ్మానికి చెందిన బాలుడుని దత్తత ఇచ్చేందు ప్రభుత్వం రెడీగా ఉందన్న విషయాన్ని ప్రభుత్వానికి చెందిన కారా వెబ్ సైట్‎ ద్వారా తెలుసుకున్నారు. విదేశీ అడాప్షన్‌ ఏజెన్సీ సహకారంతో అధికారులు కోరిన అన్ని పేపర్లను సమర్పించారు. బాలుడిని అడాప్ట్ చేసుకునేందుకు అంగీకరిస్తూ ఈ ప్రక్రియను కొనసాగించారు. భారత సర్కార్ దత్తత నిబంధనల ప్రకారం అన్ని అంశాలను పరిశీలించిన అధికారులు దత్తత ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నియమం ప్రకారం అడాప్ట్ చేసుకునే పేరెంట్స్‎తో పాటు ఎనిమిదేళ్ల వయసు దాటిన పిల్లల స్వీయ అంగీకారం తెలపడం కూడా తప్పనిసరి. ఈ క్రమంలో బాలుడిని నాలుగు నెలల పాటు కౌన్సెలింగ్‌ చేసిన తనంతరం అధికారులు ఈ ప్రక్రియను కంప్లీట్ చేశారు. బాలుడు కూడా వారితో వెళ్లేందుకు అంగీకరించాడు. దీంతో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సమక్షంలో బాలుడిని అధికారులు ఇటలీ పేరెంట్స్‎కు అప్పగించారు.







Updated : 11 July 2023 5:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top