Home > తెలంగాణ > అక్కను ఎందుకు చంపాల్సి వచ్చింది.. చందన ఏం చెప్పిందంటే..?

అక్కను ఎందుకు చంపాల్సి వచ్చింది.. చందన ఏం చెప్పిందంటే..?

అక్కను ఎందుకు చంపాల్సి వచ్చింది.. చందన ఏం చెప్పిందంటే..?
X

మూడేళ్ల ప్రేమ.. పెళ్లిచేసుకోవాలని నిర్ణయం.. దాని కోసం అడ్డం వచ్చిన వారిని ఎదురించాలనే పంతం.. ఆ పంతమే అడ్డొచ్చిన అక్కను చంపింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తన కుటుంబానికే తనను దూరం చేసింది. నమ్ముకున్నోడితో చేసిన కుట్రలకు చివరకు కటకటాలపాలయ్యింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన కోరుట్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో దీప్తి చెల్లెలు చందనతో పాటు ఆమె ప్రియుడు సుల్తాన్ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తన ప్రేమ కోసమే చందన ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇంట్లో బంగారం, డబ్బుతో పారిపోతుండగా అక్కగా అడ్డుగా నిలవడంతో ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు.

పరిచయం.. ప్రేమ..






చందన 2019లో హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యింది. రెండేళ్ల తర్వాత ఆమె డిటెయిన్ అయ్యింది. కాలేజీలో తనకంటే సీనియర్ అయిన ఉమర్ షేక్ సుల్తాన్తో ఆమెకు పరిచయం అయ్యింది. సీనియర్ అయిన అతడు డిటెయిన్ అయి చందన క్లాస్కే వచ్చి చేరాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. చేతిలో డబ్బు లేదు.. లైఫ్లో సెటిల్ అవ్వలేదు.. బయటకు వెళ్లి పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని సుల్తాన్ చందనతో చెప్పాడు.

ఇంట్లో అక్క మాత్రమే ఉందని ఫోన్..





ఇక టైం కోసం వేచి చూసిన వారికి చందన పేరెంట్స్ హైదరాబాద్ వెళ్లడం కలిసొచ్చింది. అదే మంచి సమయం అనుకుని ఈ నెల 28న చందన సుల్తాన్కు ఫోన్ చేసి కోరుట్లకు రమ్మని చెప్పింది. తల్లిదండ్రులు లేరని.. అక్క మాత్రమే ఉందని.. అంతేకాకుండా తన ఇంట్లో డబ్బు, బంగారం ఉందని.. వచ్చి తీసుకెళ్లాలని సుల్తాన్కు సూచించింది. దీంతో సుల్తాన్ కోరుట్లకు వచ్చాడు. ఆ రోజు రాత్రి సుల్తాన్తో వోడ్కా, బ్రీజర్ తెప్పించిన చందన.. అక్కతో కలిసి తాగింది. ఆ తర్వాతే వారి ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టారు.

ప్లాన్ అమలు..

అర్ధరాత్రి 2గంటలకు సుల్తాన్ చందన ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. సుల్తాన్, చందన ఇంట్లోని డబ్బు, నగలు తీస్తుండగా సడెన్గా దీప్తి లేచింది. ఏంచేస్తాన్నారటూ చెల్లిపై అరిచింది. దీంతో ఆమె అరవకుండా స్కార్ప్తో దీప్తి ముక్కు, మూతిని క్లోజ్ చేసింది చందన. ఆ తర్వాత నోటికి ప్లాస్టర్ కూడా వేసింది. కొద్దిసేపటి తర్వాత చూసేసరికి దీప్తిలో చలనం లేదు. దీంతో ప్లాస్టర్ తొలగించి ఆమెను సోఫాలో పడుకోబెట్టి సుల్తాన్తో కలిసి వెళ్లిపోయింది.

‘‘వాస్తవానికి చందనకు అక్క దీప్తిని చంపాలని ప్లాన్ లేదు.. దీప్తికి మందు తాగించి ఆమె పడుకున్న తర్వాత.. డబ్బు, నగలతో ఎస్కేప్ అవ్వాలని అనుకుంది. దీప్తి లేచి అరవడంతో చందన దారుణానికి పాల్పడింది. ఇంట్లో నుంచి లక్షా 20వేల క్యాష్, 70 తులాల బంగారం తీసుకుని చందన వెళ్లిపోయింది. డబ్బు, నగలతో ముంబై లేదా నాగాపూర్ వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నారు. కానీ వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఒంగోలులోని ఓ లాడ్జిలో వారున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. వీరికి సుల్తాన్ తల్లి, చెల్లి మరో బంధువు సహకరించారు’’ అని పోలీసులు చెప్పారు.


Updated : 2 Sept 2023 10:28 PM IST
Tags:    
Next Story
Share it
Top