తప్పంతా నాదే.. TSPSCని క్షమాపణలు కోరుతున్నా.. సుచిత్ర
ఆ విషయం గుర్తులేదు
X
గ్రూప్-1 ప్రిలిమ్స్ కు అప్లై చేయకున్నా.. తనకు హాల్ టికెట్ వచ్చిందని ఓ మీడియా సంస్థకు తెలిపి.. TSPSCని తప్పు బట్టిన ఆర్మూర్ యువతి సుచిత్ర.. చివరకు తన పొరపాటును అంగీకరించింది. తప్పంతా తనదేనని.. టీఎస్‌పీఎస్సీకి క్షమాపణలు చెప్పింది. అంతకుముందు గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయకపోయినా హాల్‌టికెట్ వచ్చిందంటూ సుచిత్ర చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) స్పందించింది. సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు జోరుగా ప్రచారం కావడంతో టీఎస్‌పీఎస్సీ ఖండించింది. సుచిత్ర గ్రూప్-1 ప్రిలిమ్స్ కే అప్లై చేసిందని క్లారిటీ ఇచ్చింది. సుచిత్ర గ్రూప్-1 హాల్ టికెట్ కూడా పొందారని, ఆమె ఆరోపణలు సరికాదని కొట్టిపారేసింది .
టీఎస్‌పీఎస్సీ ఐడీ TS1201206420తో గ్రూప్-1కు దరఖాస్తు చేశారని, అక్టోబర్ 16న పరీక్ష కూడా రాశారని సెంటర్ కోడ్, నామినల్ రోల్‌లో సుచిత్ర సంతకం చేసిన వివరాలతో సహా టీఎస్‌పీఎస్సీ సోమవారం వెల్లడించింది. మంగళవారం సుచిత్ర ఈ విషయంపై స్పందిస్తూ.. ‘నేను గ్రూప్-1కు దరఖాస్తు చేశాను. గత అక్టోబర్‌లో పరీక్ష రాశాను. మా దగ్గరి బంధువులు నలుగురు చనిపోయారు. ఆ డిప్రెషన్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అప్పుడు పరీక్ష రాసిన విషయం గుర్తులేదు. శనివారం హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ సమయంలోనే ఒక మీడియా సంస్థతో మాట్లాడాను. దాన్ని కొందరు బాగా వైరల్ చేస్తున్నారు. ఈ విషయంలో తప్పంతా నాదే.. టీఎస్‌పీఎస్సీని క్షమాపణలు కోరుతున్నాను’ అని తెలిపారు.