Home > తెలంగాణ > తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి పవన్ కల్యాణ్

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి పవన్ కల్యాణ్

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి పవన్ కల్యాణ్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారబరిలోకి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దిగుతున్నారు. తన పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలోని బీజేపీ అభ్యర్థుల తరుపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం వరంగల్‌ వెస్ట్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్‌గౌడ్‌కు మద్దుతగా, 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌కు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

తెలంగాణలో మోదీ పాల్గొనే బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు. అయితే తెలంగాణలో పవన్ ప్రచారం ఉంటుందా.. లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలకు గడువు దగ్గర పడడతుండడం.. పవన్ ప్రచారంపై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ అనుమానాలు నెలకొన్నాయి. అయితే వాటన్నింటికి తెరదించుతూ పవన్ ప్రచార షెడ్యూల్ను జనసేన విడుదల చేసింది. కాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన 8స్థానాల్లో పోటి చేస్తుండగా.. మిగితా చోట్ల బీజేపీకి మద్ధతు ఇస్తోంది.

Updated : 21 Nov 2023 6:11 PM IST
Tags:    
Next Story
Share it
Top