Home > తెలంగాణ > కంటతడి పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్సీ వల్లే అంటూ..

కంటతడి పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్సీ వల్లే అంటూ..

కంటతడి పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్సీ వల్లే అంటూ..
X

బీఆర్ఎస్లో టికెట్ల లొల్లి షురూ అయ్యింది. పలువురు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల టెన్షన్ పట్టుకుంది. కొన్ని చోట్ల గులాబీ బాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా ఎమ్మెల్సీలకు టికెట్లు ఇస్తున్నారనే ప్రచారం జోరందుకోవడం ఈ లొల్లి మొదలైంది. జనగామ ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ కు ఇస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన కంటతడి పెట్టారు.





తనపై పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆరోపించారు. తనకే టిక్కెట్ ఇస్తున్నారని ప్రచారం చేస్తూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. తనను ఓడించలేక తన ఇంట్లోనే చిచ్చుపెట్టారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ పిలుపు మేరకు 2002లో తాను తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నా. నేను రెండుసార్లు జనగామ నుంచి గెలిచా. కానీ ఏడేళ్లుగా పల్లా ఒక్కసారి కూడా కనిపించలేదు. ఆయన ఎంత ఎత్తు ఉన్నారో.. అంత పెద్ద కుట్రలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు’’ అని అన్నారు.





జనగామ నియోజకవర్గం గురించి పల్లాకు ఏం తెలుసని ప్రశ్నించిన ముత్తిరెడ్డి.. నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో డబ్బులతో జనగామను మరో హుజూరాబాద్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? అని ప్రశ్నించారు. ‘‘జనగామ టికెట్ నీకు ఇచ్చినట్లు ఎలా చెబుతున్నావ్? ఇది పార్టీ నిబంధనలకు విరుద్ధం కాదా?. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారని మీకు తెలియదా?. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తనయుడు నీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు’’ అని నిలదీశారు.


Updated : 19 Aug 2023 3:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top