Home > తెలంగాణ > అమిత్ షాతో పవన్ భేటీ.. తెలంగాణలో పొత్తులపై కీలక చర్చలు..

అమిత్ షాతో పవన్ భేటీ.. తెలంగాణలో పొత్తులపై కీలక చర్చలు..

అమిత్ షాతో పవన్ భేటీ.. తెలంగాణలో పొత్తులపై కీలక చర్చలు..
X

తెలంగాణలో ప్రస్తుతం పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ సీపీఐ, సీపీఎంలతో చర్చలు జరుపుతుండగా.. బీజేపీ జనసేనతో మంతనాలు సాగిస్తోంది. ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు అంశంపై వీరు చర్చించారు.

తెలంగాణలో 30స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. అయితే 6 - 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 20 సీట్లు అయినా ఇవ్వాలని జనసేన పట్టుబడుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీపై జనసేన గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా పొత్తులపై త్వరలోనే ఓ స్పష్టత వస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 1న బీజేపీ సీఈసీ మీటింగ్ ఉంటుందని.. ఆ తర్వాతే రెండో జాబితా విడుదల చేస్తామని చెప్పారు.


Updated : 25 Oct 2023 10:17 PM IST
Tags:    
Next Story
Share it
Top