చంద్రబాబును పరామర్శించిన పవన్ కల్యాణ్
Kiran | 4 Nov 2023 4:55 PM IST
X
X
టీడీపీ చీఫ్ చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్టోబరు 31న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు మెడికల్ టెస్టుల కోసం హైదరాబాద్ వచ్చారు.
శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు బ్లడ్తో పాటు హార్ట్, లంగ్స్, స్కిన్ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు త్వరలోనే ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటిల్లో కంటి పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకుంటారని సమాచారం.
Updated : 4 Nov 2023 4:55 PM IST
Tags: andhra pradesh hyderabad chandrababu naidu tdp chief janasena pawan kalyan nadendla manohar rajamahendravaram jail aig hospital health checkup lv prasad eye hospital eye surgery
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire