Home > తెలంగాణ > తెలంగాణ నుంచి జనసేన పోటీ.. ఎన్ని స్థానాల్లో అంటే..

తెలంగాణ నుంచి జనసేన పోటీ.. ఎన్ని స్థానాల్లో అంటే..

తెలంగాణ నుంచి జనసేన పోటీ.. ఎన్ని స్థానాల్లో అంటే..
X

ఏపీలో బీజేపీతో పొత్తుపెట్టుని ఈసారి ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్న జనసేన పార్టీ తెలంగాణపైనా కన్నేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ సైన్యం ప్రకటించింది. 32 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరు శంకర్ గౌడ్ చెప్పారు. ‘‘కచ్చితంగా పోటీ చేస్తాం. ఎల్బీ నగర్ వంటి స్థానాల నుంచి బరిలోకి దిగుతాం. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతాం. ఎల్బీ నగర్‌లో యువత గంజాయి, డ్రగ్స్‌కు అలవాటుపడింది. వారిని కాపాడాలి’’ అని ఆయన అన్నారు. తెలంగాణలోనూ పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ఇదివరకు కూడా చెప్పినా స్పష్టమైన ప్రకటనేదీ చేయలేదు. ప్రస్తుతం వారాహి విజయయాత్రలో తిరుగుతున్న పవన్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఎన్నికల నాటికి మళ్లీ సమరంలో దూకుతారని తెలుస్తోంది.

Updated : 29 Aug 2023 2:14 PM IST
Tags:    
Next Story
Share it
Top