Janasena, BJP alliance: బీజేపీతో పొత్తు కొలిక్కి.. జనసేనకు 10 టికెట్లు!
X
తెలంగాణ అసెంబ్లో ఎన్నికల్లో జనసేన ఎంట్రీ పక్కా అయిపోయింది. బీజేపీతో పొత్తు కొలిక్కి వచ్చింది. శనివారం రాత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్షణ్.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇంట్లో సమావేశం అయ్యారు. పొత్తుల విషయంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీకి 32 సీట్లు ఇవ్వాలని పవన్ కోరగా.. 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు సంసిద్ధం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తర్వాత మరో సీటును పవన్ కోరగా దానికి కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. కూకట్పల్లి, మెదక్, తాండూరు, నాగర్కర్నూల్, కోదాడ, అశ్వారావుపేట, వైరాతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో మరో సీటు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం మీడియాతో కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తీసుకోబోతున్న చర్యలపై చర్చించారు.
మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు. జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చలు తుది దశకు వచ్చాయని, ఇంకా రెండు సీట్లపై క్లారిటీ రావాల్సి ఉందని అన్నారు. నవంబర్ 7న హైదరాబాద్ లో నిర్వహించే ప్రధాని సభకు హాజరవుతున్నట్లు చెప్పారు. త్వరలో తెలంగాణలో వారాహి యాత్ర చేపట్టి ఎన్నికల ప్రచారం చేపడతామని వివరించారు. అనంతరం మాట్లాడిన కిషన్ రెడ్డి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు జనసేన ఎంతో కృషి చేసిందని అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.