Home > తెలంగాణ > Jitta Balakrishna Reddy: 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి జిట్టా బాలకృష్ణారెడ్డి

Jitta Balakrishna Reddy: 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి జిట్టా బాలకృష్ణారెడ్డి

Jitta Balakrishna Reddy: 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి జిట్టా బాలకృష్ణారెడ్డి
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రధానపార్టీలకు చెందిన నాయకులంతా పక్క పార్టీల్లోకి చేరుతున్నారు. ఆయా పార్టీల తరఫున టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు ఇతర పార్టీలకు జంప్‌ అవుతున్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి . కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ చేస్తూ నేతలు షాకిస్తున్నారు. తాజగా గా భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) ఆ పార్టీని వీడనున్నారు. ఈ రోజు సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. కొన్నిరోజుల క్రితమే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు జిట్టా. అయితే.. భవనగిరి టికెట్ ఆయనకు కాకుండా... కుంభం అనిల్ కుమార్ రెడ్డికి (Kumbham Anil Kumar Reddy) ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారం సాగుతుంది. దీంతో జిట్టా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసి.. బీఆర్ఎస్ శ్రేణులు ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని జిట్టాకు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీలో చేరేందుకు అంగీకరించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ రోజు భువనగిరిలో జరగనున్న సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో జిట్టా బాలకృష్ణారెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

2009 వరకు జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన చాలా యాక్టీవ్ గా పని చేశారు. అయితే.. 2009లో భువనగిరి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురై... సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిఆ పార్టీకి దూరమయ్యారు. ఇండిపెండెంట్ గా భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. దాదాపు ఏడాది క్రితం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అయితే ఇటీవల ఆ పార్టీ(BJP) అధినాయకత్వంపై ఇటీవల తీవ్ర విమర్శలు చేయడంతో.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యాక కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు జిట్టా. భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే జిట్టా కాంగ్రెస్ లోకి చేరినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ.. కుంభం అనిల్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించడం.. ఆయనకే టికెట్ అన్నట్లుగా సంకేతాలు ఇవ్వడంతో బాలకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి చేరనున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి.

Updated : 16 Oct 2023 8:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top