బీజేపీ నుంచి జిట్టా బాలకృష్ణా రెడ్డి సస్పెండ్
X
బీజేపీ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి సస్పెండ్ అయ్యారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడడంతో క్రమశిక్షణ చర్యల క్రింద ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ కార్యదర్శి ఉమాశంకర్ ప్రకటించారు. అయితే జిట్టా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. భువనగిరి డీసీసీ అధ్యక్షులుగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో.. జిట్టాను పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది.
ఈ ప్రయత్నాలు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అటు బీజేపీపై విమర్శలు చేస్తూనే.. కాంగ్రెస్లో చేరికపై కార్యకర్తలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ - బీఆర్ఎస్ ఒక్కటే అని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని బీజేపీలో చేరానని.. కానీ బీజేపీతో అవి నెరవేరయని అర్థమైందని అన్నారు.
పార్టీపై తీవ్ర ఆరోపణలు చేయడంతో బీజేపీ ఆయనపై చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన అనిల్ రెడ్డికి బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ టిక్కెట్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ లోకి వచ్చే జిట్టా బాలకృష్ణా రెడ్డికి.. ఆ పార్టీ భువనగిరి టిక్కెట్ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. ఏదిఏమైనా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.