Home > తెలంగాణ > ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్లకు జేఎన్టీయూ అనుమతి

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్లకు జేఎన్టీయూ అనుమతి

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్లకు జేఎన్టీయూ అనుమతి
X

ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు జేఎన్టీయూ గుడ్ న్యూస్ తెలిపింది. ఒక కాలేజీ నుంచి మ‌రొక కాలేజీకి విద్యార్థులు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యేందుకు అనుమతిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆరోగ్య సమస్యలు సహా పలు కారణాలతో విద్యార్థులు ట్రాన్స్ఫర్లకు అనుమతి కోరుతారు. ఇలాంటి సందర్భంలో విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా స్టూడెంట్స్ ట్రాన్స్‌ఫ‌ర్‌ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అనుగుణంగా జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి ట్రాన్స్‌ఫర్లకు అనుమతిచ్చారు.




రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫర్లు ఉండనున్నాయి. ఫస్టియర్‌ నుంచి ఫస్టియర్‌కు రూ.10 వేలు, సెకండియర్‌ నుంచి సెకండియర్‌కు రూ.15 వేలు, థర్డ్‌ ఇయర్‌ నుంచి థర్డ్‌ ఇయర్‌కు రూ. 20 వేలు, ఫోర్త్‌ ఇయర్‌ నుంచి ఫోర్త్‌ ఇయర్‌కు రూ.25 వేల చొప్పున స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఈ మేరకు కాలేజీ యాజమన్యాలు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

Updated : 12 Jun 2023 9:39 PM IST
Tags:    
Next Story
Share it
Top