బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి - జేపీ నడ్డా
X
తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలే మారిపోతాయని అన్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో నడ్డా మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయమైందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేండ్లలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బందు పథకంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారని నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి చేరిందన్న నడ్డా.. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.