Home > తెలంగాణ > Junior Panchayat Secretaries : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం గుడ్ న్యూస్

Junior Panchayat Secretaries : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం గుడ్ న్యూస్

Junior Panchayat Secretaries  : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం గుడ్ న్యూస్
X

జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పింది. 455 మందిని గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9,355 మంది జేపీఎస్‌లలో 6,603మందిని గ్రేడ్-4గా రెగ్యులరైజేషన్‌ చేసేందుకు నిర్ణయించింది. ఇందులో గత డిసెంబర్ 31 నాటికి 4,001 మందిని క్రమబద్దీకరించింది. తాజాగా మరో 455 మందిని ఈ జాబితాలో చేర్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రొబేషన్ పీరియడ్‌ను రెండేళ్లుగా ఖరారు చేసి రూ.15 వేల వేతనాన్ని నిర్ణయించింది. మళ్లీ ప్రొబేషన్ టైమ్ ఒక సంవత్సరం పెంచింది.

ఇకపై జేపీఎస్‌లు పంచాయతీరాజ్‌ కార్యదర్శులుగా గ్రేడ్‌- 4 హోదాలో కొనసాగనున్నారు. ప్రస్తుతం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.28,719 వేతనం వస్తుండగా.. గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులకు వేతన స్కేల్‌ను రూ.24,280-72,850 వర్తింపజేయనుంది. రాష్ట్రంలో 9355 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా.. వారిని క్రమబద్ధీకరించి గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అర్హులను గుర్తించాలని గతంలో కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లాల్లో వారి పనితీరును అంచనా చేసి 6616 మందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా గుర్తించి వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ వినతి మేరకు కొత్తగా 6603 గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసింది. మంజూరు పోస్టుల కంటే 13 మంది అర్హులు ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే శాఖాపరంగా ఉన్న 3065 పోస్టుల్లో వారిని సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.




Updated : 6 Feb 2024 6:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top