ఆ పోలీసులను వెంటనే బదిలీ చేయండి.. ఈసీకి జూపల్లి ఫిర్యాదు
Krishna | 3 Nov 2023 10:38 PM IST
X
X
తెలంగాణలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో కొందరు పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణా రావు ఆరోపించారు. సదరు అధికారులను వెంటనే బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సీఈవో వికాస్ రాజ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో చాలా మంది పోలీసులు ఎక్కువ కాలం నుంచి ఓకే చోట ఉన్నారని.. వారిని వెంటనే బదిలీ చేయాలని కోరారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని జూపల్లి ఆరోపించారు. తాము ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కొల్లాపూర్లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవన్నారు. కాబట్టి ఎన్నికల సంఘం అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులను వెంటనే బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Updated : 3 Nov 2023 10:38 PM IST
Tags: jupally krishna rao kollapur police jupally complaint ec jupally fires kollapur police kollapur police telangana police telangana congress telangana politics telangana news telangana updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire