కాంగ్రెస్లో చేరిన జూపల్లి కృష్ణారావు..
X
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సహా ఆయన తనయుడు రాజేష్ రెడ్డి హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
జూపల్లి ఇప్పటికే కాంగ్రెస్లో చేరాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. కొల్లాపూర్లో భారీ బహిరంగ పెట్టి కాంగ్రెస్లో జాయిన్ కావాలని ఆయన భావించారు. కానీ వర్షాల వల్ల ఆ సభ పలుసార్లు వాయిదా పడింది. దీంతో మనుసు మార్చుకున్న ఆయన.. ఢిల్లీ వెళ్లి ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అంతుకుముందు ఖమ్మంలో నిర్వహించిన సభలో జూపల్లి చేరుతారని ప్రచారం జరిగినా.. ఆయన చేరలేదు