Home > తెలంగాణ > జూరాలకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తి నీటి విడుదల..

జూరాలకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తి నీటి విడుదల..

జూరాలకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తి నీటి విడుదల..
X

జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షపు నీరు ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరువవుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తారు. 31 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1045 ఫీట్లుకాగా.. ప్రస్తుత నీటి మట్టం 1041.73 ఫీట్లుగా ఉంది. ఇన్ ఫ్లో 1,31,700 క్యూ సెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో : 1,24,296 క్యూసెక్కులుగా ఉంది.

కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంల నుంచి నీరు విడుదల చేయడంతో జూరాలకు వరద కొనసాగుతోంది. జూరాల నుంచి ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేయడంతో పాటు అధికారులు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.

Updated : 29 July 2023 3:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top