Home > తెలంగాణ > సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కేఏ పాల్
X

సీఎం రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం సదస్సుకు ఆహ్వానించినట్లు వివరించారు. పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు కేఏ పాల్‌ వెల్లడించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేఏ పాల్ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. సీఎంతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు కేఏ పాల్ చెప్పారు. కొత్త రేషన్ కార్డుదారులకు సైతం ఆరు గ్యారెంటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన క్రైస్తవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని.. ఆ లెక్కనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని అన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కేఏ పాల్ సీఎంను కోరినట్లు తెలుస్తోంది.


Updated : 25 Dec 2023 3:36 PM IST
Tags:    
Next Story
Share it
Top