Home > తెలంగాణ > ప్రధాని మోదీని చిత్తుగా ఓడించేందుకు నేను సిద్ధం: కేఏ పాల్

ప్రధాని మోదీని చిత్తుగా ఓడించేందుకు నేను సిద్ధం: కేఏ పాల్

ప్రధాని మోదీని చిత్తుగా ఓడించేందుకు నేను సిద్ధం: కేఏ పాల్
X

ప్రధాని మోదీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ వార్తల్లో నిజం ఉంటే.. తెలుగోడి సత్తా చూపించేందుకు తాను సిద్ధం అని కేఏ పాల్ అన్నారు. తెలంగాణలో మోదీ పోటీ చేస్తే.. తప్పక ఆయనపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని చెప్పుకొచ్చారు. ఇవాళ (డిసెంబర్ 20) ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులను తాను తప్పా.. ఇంకా ఎవరూ తీర్చలేరని అన్నారు. దేశంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని తెలిపారు. జేడీ లక్ష్మీ నారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు రూ.వెయ్యి కోట్లు ఇచ్చాయని ఆరోపించారు. అమిత్ షా, మోదీలు గతంలో తనను విదేశాంగ మంత్రిగా చేయాలని కోరారని, కానీ ఆ పదవిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు.

Updated : 20 Dec 2023 8:15 PM IST
Tags:    
Next Story
Share it
Top