అతడిని చిత్రహింసలు పెట్టారు.. చిరంజీవిపై కేఏ పాల్ సంచలన కామెంట్స్
X
మెగాస్టార్ చిరంజీవి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. మీడియా ముందు నీతి కబుర్లు చెప్పే చిరంజీవి తన కూతురు విషయంలో ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందేనని అన్నారు. తన కూతురు ఓ బ్రాహ్మణున్ని పెళ్లి చేసుకుంటే అతడిని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ లాగే పవన్ జనసేన తయారవుతుందని పాల్ ఎద్దేవా చేశారు. పవన్ తన పార్టీని బీజేపీలో కలిపేస్తారని అన్నారు. 5వేల కోట్ల డబ్బు, క్యాబినెట్ పదవి తీసుకుని బీజేపీలో విలీనం చేస్తారన్నారు. పవన్ ఓ ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. ప్యాకేజీ స్టార్‌లు కావాలా..సినీహీరో కావాలా.. వరల్డ్ హీరో కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. అంతేకాకుండా తాను తెలంగాణ సీఎం అవ్వడం ఖాయమని పాల్ చెప్పారు.
మోదీ, కేసీఆర్, రాహుల్ గాంధీలను ఢీకొట్టే శక్తి తనకే ఉందని కేఏ పాల్ అన్నారు. ‘‘కేసీఆర్ మంత్రి వర్గంలో చాలామంది నాతో టచ్లో ఉన్నారు. నేను గెలిస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. కవితను ఈడీ అరెస్ట్ చేయకపోతే బీజెపీ 40 సీట్లు గెలుస్తుంది. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం. కేసీఆర్.. గద్దర్ బతికి ఉన్నప్పుడు పట్టించుకోలేదని.. ఆయన చనిపోతే మాత్రం అన్ని పార్టీల నాయకులూ వచ్చి వాలిపోయారు’’ అని పాల్ విమర్శించారు.