Kagaznagar To Kazipet : కాగజ్నగర్- కాజీపేట మధ్య మరోసారి రైళ్లు రద్దు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
X
(Kagaznagar To కాజిపేట్) గత కొన్ని నెలలుగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట -బల్లార్షా, విజయవాడ- సికింద్రాబాద్ మార్గంలో మూడో రైల్వే లైన్ ట్రాక్ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి కాగజ్ నగర్ - కాజీపేట మధ్య జరుగుతున్న రైల్వేట్రాక్, తదితర పనుల కారణంగా పలు రైళ్లును రద్దుచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగజ్ నగర్ మీదుగా ఢిల్లీ, నాగ్ పూర్, హైదరాబాద్, వరంగల్, కాజీపేట వైపు నడిచే పలు రైళ్లు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని కాగజ్ నగర్ రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ కైలాష్ తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వైపు నడిచే.. కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్, ఇంటర్సీటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు.. ఫిబ్రవరి 5 నుంచి 11వ తేదీ వరకు రద్దు కానున్నాయి. వీటితో పాటు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కాగజ్ నగగర్ నుంచి కాకుండా.. కేవలం సికింద్రాబాద్- కాజీపేట మధ్య మాత్రమే తిరగనుంది. అంతేకాకుండా.. చెన్నై, ఢిల్లీ వైపు ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఫిబ్రవరి 12 నుంచి 28వ తేదీ వరకు రద్దు కానున్నాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నారు.
రైద్దైన రైళ్ల వివరాలు:
సిర్పూర్- కరీంనగర్ ఫుష్ పుల్, కాజీపే ట- సిర్పూర్ (రామగిరి ప్యాసింజర్), కాగజ్ నగర్- సికింద్రాబాద్ (కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్), కోర్బా- కోచివెల్లి, యశ్వంత్ పూర్- జబల్పూర్, గోరఖ పూర్- యశ్వంత్ పూర్, లక్నో- చెన్నై (లక్నో ఎక్స్ ప్రెస్), మాతావైష్ణోదేవి- మద్రాస్ ఎక్స్ ప్రెస్, కాజీపేట- పుణె, కన్యాకుమారి- బనారస్, సికింద్రాబాద్- రక్సోల్, హైదరాబాద్- రక్సోల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఫిబ్రవరి 28వ తేదీ వరకు పూర్తిగా రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
గత డిసెంబరు 19 నుంచి జనవరి 13వ తేదీ వరకు కూడా రైళ్లను రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వందల కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణం చేయలేక అవస్తలు పడ్డారు. ఇప్పుడు మరోసారి రైళ్లు రద్దు చేయడంలో పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. త