Home > తెలంగాణ > నకిలీ సర్టిఫికేట్లతో ఎంబీబీఎస్ సీటు..ఆ తర్వాత వెరిఫికేషన్‎లో ట్విస్ట్ మామూలుగా లేదు

నకిలీ సర్టిఫికేట్లతో ఎంబీబీఎస్ సీటు..ఆ తర్వాత వెరిఫికేషన్‎లో ట్విస్ట్ మామూలుగా లేదు

నకిలీ సర్టిఫికేట్లతో ఎంబీబీఎస్ సీటు..ఆ తర్వాత వెరిఫికేషన్‎లో ట్విస్ట్ మామూలుగా లేదు
X

బోగస్ సర్టిఫికేట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రద్దు చేసింది. అక్రమంగా మెడికల్ సీట్లు పొందిన ఏపీకి చెందిన ఏడుగురు విద్యార్థులతో పాటు ఈ దందాకు సూత్రధారైన కన్సల్టెంట్ నిర్వాహకుడు కామిరెడ్డి నాగేశ్వరరావుపైన వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు అయ్యింది. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యసాయి తేజ, వాని పెంట సాయి ప్రీతికారెడ్డి, తమ్మినేని విష్ణుతేజా రెడ్డి, తన్నీరు సంజయ్, అరికట్ల హనుమాన్ రెడ్డి, టేకులపల్లి మహేశ్, గేర్లె భార్గవ్ ధర్మతేజ యశ్వంత్ నాయుడులను పోలీసులు విచారిస్తున్నారు.

2023-24 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన ఏడుగురు విద్యార్థుల ప్రవేశాలపై వర్సిటీ అధికారులకు అనుమానం వచ్చింది. వీరంతా ఆరు నుంచి 9వ తరగతి వరకు తెలంగాణలో చదివినట్టు సర్టిఫికేట్లలో పొందుపరిచారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇలా చదివితే లోకల్ అభ్యర్థుల కింద సీటు పొందొచ్చు. దీంతో వీరంతా స్థానిక కోటాలో సీట్లు పొందారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఏపీలో చదివారు. నీట్ పరీక్ష కూడా ఏపీ నుంచే రాయడంతో అధికారులు అనుమనం వచ్చింది. సర్టిఫికేట్లతో ప్రత్యక్షంగా వర్శిటీకి రావాలని విద్యార్థులను వివరణ కోరారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. విజయవాడలోని ఒక ఏజెన్సీ నడిపే కామిరెడ్డి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమకు తెలియకుండా సర్టిఫికేట్లు పొందుపరిచారని అధికారులకు తెలిపారు. దీంతో ఈ సర్టిఫికేట్లు నకిలీవని తేల్చిన వర్శిటీ వీరి ప్రవేశాలను రద్దు చేసింది. దందాకు ప్రధాన సూత్రధారి అయిన నాగేశ్వరరావుతోపాటు ఏడు గురు విద్యార్థులపై రిజిస్ట్రార్ సంధ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిని దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 30 Sept 2023 11:35 AM IST
Tags:    
Next Story
Share it
Top