Home > తెలంగాణ > Kannepalli: కన్నేపల్లి KGBV స్కూల్ విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Kannepalli: కన్నేపల్లి KGBV స్కూల్ విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Kannepalli: కన్నేపల్లి KGBV స్కూల్ విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
X

మంచిర్యాల జిల్లా కన్నేపల్లి కేజీబీవీ స్కూల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10మంది స్టూడెంట్స్ అకస్మాతుగా కళ్లు తిరిగి పడిపోగా.. టీచర్లు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు, నాలుగు రోజుల నుంచి విద్యార్థులు ఫీవర్తో బాధపడుతున్నా హాస్టల్ వార్డెన్ పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్ చుట్టుపక్కల శుభ్రంగా లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated : 8 Oct 2023 2:53 PM IST
Tags:    
Next Story
Share it
Top