Home > తెలంగాణ > చికెన్ బొక్క ఇరగలేదని..బిర్యానీ సెంటర్‎పై కేసు

చికెన్ బొక్క ఇరగలేదని..బిర్యానీ సెంటర్‎పై కేసు

చికెన్ బొక్క ఇరగలేదని..బిర్యానీ సెంటర్‎పై కేసు
X

బిర్యానీ అంటే నచ్చని వారు ఎవరుంటారు చెప్పండి. ఆ పేరు వింటేనే అందరి నోరూరిపోతాయి. ఒక్కోప్రాంతంలో ఒక్కో రకం బిర్యానీకి క్రేజ్ ఉంటుంది. సమయం, సందర్భం అంటూ ఏమీ చూసుకోకుండా చాలా మంది వీలు చిక్కినప్పుడల్లా బిర్యానీని టేస్ట్ చేస్తుంటారు. అందుకే ప్రతి హోటల్‎లో రెస్టారెంట్లలో బిర్యానీ, మెనులో మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే బిర్యానీని టేస్ట్ చేద్దామనుకున్న ఓ యువకుడికి మాత్రం తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఎంత కొరికినా బిర్యానీలోని చికెన్ బొక్క ఇరగకపోవడంతో యువకుడికి ఇది చికెనేనా?అన్న అనుమానం వచ్చింది. దీంతో ఆ యువకుడు బిర్యానీ సెంటర్‎పై పోలీస్ స్టేషన్‎లో కేసు వేశాడు.

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు బిర్యానీ టేస్ట్ చేయాలని స్థానికంగా ఉన్న రెడ్ బకెట్ ప్రాంచైజీ షాప్ కి వెళ్లాడు. ఓ బకెట్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆ బిర్యానీని ఇంటికి తీసుకెళ్లి మరీ తినడం మొదలుపెట్టాడు. బిర్యానీలో తన ఫేవరెట్ లెగ్ పీస్ తీసుకుని ఒక్క కొరుకు కొరికాడు...అయితే ఎంత కొరికినా బొక్క మాత్రం విరగలేదు. దీంతో ఇది అసలు చికెన్ బిర్యానీనేనా అన్న అనుమానం వచ్చింది ఆ యువకుడికి దీంతో వెంటనే బిర్యానీ కొనుగోలు చేసిన షాపుకు వెళ్లాడు. ఓనర్‎ను నిలదీశాడు. ఇది చికెన్ బిర్యానీనే కాదని వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ మొదలు కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులకు యువకుడు అంతా చెప్పాడు. దీంతో పోలీసులు బిర్యానీతో పాటు బొక్కలను స్వాధీనం చేసుకున్నారు. షాపు ఓనర్‏తో పాటు యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఈ పంచాయితీ లేలేలా లేదని పోలసులు వెంటనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రెడ్ బకెట్ షాపును తనిఖీ చేశారు. బిర్యానీ, లెగ్‌పీస్ తో పాటు అందులో వాడుతున్న నూనె, ఇతర సామాన్ల సాంపిల్స్‎ను కలెక్ట్ చేశారు. వాటిని ల్యాబ్‌కు తరలించారు. ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

ఈ ల్యాబ్ టెస్ట్‏లో ఎలాంటి ఫలితం వస్తుందోనని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.



Updated : 5 Aug 2023 9:36 AM IST
Tags:    
Next Story
Share it
Top