Home > తెలంగాణ > సీఎం రేవంత్ ను కలిసిన కర్ణాటక మంత్రి

సీఎం రేవంత్ ను కలిసిన కర్ణాటక మంత్రి

సీఎం రేవంత్ ను కలిసిన కర్ణాటక మంత్రి
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కర్ణాటక మంత్రి బోసురాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన మంత్రి బోసురాజు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించారు. కాగా గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బోసురాజు మాన్వి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం ఆయనను సిద్ధరామయ్య కేబినేట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. క్షత్రియ కులానికి చెందిన బోసు రాజును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు.




Updated : 7 Jan 2024 4:34 PM IST
Tags:    
Next Story
Share it
Top