Breaking News : తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని రాజీనామా
X
కాసాని జ్ఞానేశ్వర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. తెలంగాణలో పోటీ చేయొద్దని చంద్రబాబు చెప్పారని.. కానీ క్యాడర్ పోటీ చేయాలని కోరుకుంటోందని అన్నారు. క్యాడర్కు అన్యాయం చేసి పార్టీలో ఉండలేనని అన్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని.. ఎన్నికల్లో పోటీకి అంతా సిద్ధం చేశాక పోటీ నుంచి విరుమించుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై లోకేష్కు 20సార్లు ఫోన్ చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది కాకముందే ఆ పదవికి రాజీనామా చేశారు. 2022 అక్టోబర్ 14న ఆయన టీడీపీలో చేరగా.. నవంబర్ 4న అధిష్టానం ఆయనను తెలంగాణ అధ్యక్షుడిగా నియమించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున సికింద్రాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. కాసాని 2001 నుంచి 2006 వరకు రంగారెడ్డి జడ్పీ చైర్మన్గా పనిచేశారు. 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా పనిచేశాడు. 2007లోనే ఆయన మన పార్టీని స్థాపించి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.