Home > తెలంగాణ > Revanth Reddy: ‘సోనియా గాంధీ వేసిన భిక్షతో.. బీఆర్ఎస్ నేతలు పదవుల్లో ఉన్నరు’

Revanth Reddy: ‘సోనియా గాంధీ వేసిన భిక్షతో.. బీఆర్ఎస్ నేతలు పదవుల్లో ఉన్నరు’

Revanth Reddy: ‘సోనియా గాంధీ వేసిన భిక్షతో.. బీఆర్ఎస్ నేతలు పదవుల్లో ఉన్నరు’
X

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్, హరీష్ రావులపై వ్యంగ్యాస్థ్రాలు గుప్పించారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఎంపీపీలు, కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లిఖార్జున్ ఖర్గే వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రం నలుమూలల బిల్లా రంగాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకరకమైన దోపిడి, రాష్ట్రం వచ్చిన తర్వాత మరోరకమైన దోపిడికి పాల్పడుతుందని మండిసడ్డారు. అధికారాన్ని దుర్వినియోగపరిచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా, ధరణి రూపంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. అందుకే కేసీఆర్ ముఖం చెల్లక, ప్రజలకు ఏం చెప్పాలో తెలియక ఫామ్ హౌస్ లో ఉంటున్నారని అన్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ.. ఏం చేయాలో తోచక.. కేటీఆర్, హరీష్ రావులు ఊర్లల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని, నాయకులను తిడుతున్నారని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. 11 సార్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందో వెళ్లి కేసీఆర్ ను అడగమని అన్నారు. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తుచేశాడు రేవంత్. ‘కేసీఆర్ కు యూత్ కాంగ్రెస్ లో అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. సింగిల్ విండో డైరెక్టర్ గా నిలబెట్టింది కాంగ్రెస్’ అని చెప్పుకొచ్చారు. హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందే కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందని, సోనియా గాంధీ వేసిన భిక్ష వల్లే సిద్దిపేటకు ఎమ్మెల్యే అయ్యారని ఆరోపించారు. రబ్బర్ చెప్పులతో నడిచే హరీష్ రావును.. విమానాల్లో తిరిగే అవకాశం కల్పించింది సోనియా గాంధీ అని దుయ్యబట్టారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ పథకం, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్ మెంట్, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్, జలయజ్ఞం ప్రాజెక్ట్ ద్వారా తాగునీటి అందిచినప్పుడు మిగతా ఏ రాష్ట్రాల్లో ఈ పథకాలు లేవని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకులు.. తమ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిపి మిగతా జిల్లాలకు వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తమకు కావాల్సిన వారికే దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నారని మండిపడ్డారు.

Updated : 6 Oct 2023 3:07 PM IST
Tags:    
Next Story
Share it
Top